navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 2:48 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

మల్లాపూర్ కేంద్రంలోని లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

జగిత్యాల/మల్లాపూర్,ఆగస్టు4,(నవగీతం) జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలనీ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ.పి.సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగు పరచాలని డాక్టర్లు సమయ పాలన పాటించాలని, జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వర్షాకాలం వ్యాధుల పట్ల డెంగ్యూ, వైరల్ ఫీవర్లకు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పాముకాటు, కుక్క కాటు, కోతుల వల్ల ప్రమాదం జరిగితే అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఉండకుండా చూసుకోవాలన్నారు. డాక్టర్లను పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని వున్న మంచినీటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు నాణ్యతమైన వంట సామాగ్రి మంచి భోజనం అందించాలి ఆదేశించారు.ఈ పరిశీలనలో మెట్ పల్లి ఆర్డీవో నరసింహ రావు, జిల్లా వైద్యాధికారి సుజాత, ఎమ్మార్వో రాంచందర్,ఎంపిడివో శ్రీకాంత్, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.