ప్రజాప్రతినిధులు లేకున్నా మేమున్నాం: విద్యార్థుల ప్రతిభకు ‘యువ’ కిరీటం!
రాజేశ్వరరావుపేట్ యువత ఆదర్శం పదో తరగతి టాపర్లకు ఘన సన్మానం, నగదు ప్రోత్సాహం నవగీతం, మెట్‌పల్లి ప్రతినిధి : రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా.. బాధ్యత గల యువత ఉంటే గ్రామానికి తిరుగులేదని మెట్ పల్లి మండలం లోని రాజేశ్వరరావుపేట్ యువకులు నిరూపించారు. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడంలో స్థానిక యువత చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.మెట్‌పల్లి మండలంలోని రాజేశ్వరరావుపేట్ గ్రామంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు యువత ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు....