ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ ఆర్డీఓలతో కలిసి కలెక్టర్ బి.సత్య ప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో...