navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 3:03 pm Digital Edition : NAVAGEETAM

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

పలు సమస్యలపై వినతులు స్వీకరించిన  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అదేశించారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపుకలెక్టర్ లతో కలిసి స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 76 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం జనాభ లెక్కల – స్వీయ గణన -2027 పై జిల్లా స్థాయి అధికారులకు సోమవారం సాయంత్రం ప్రతి ఉన్నతాధికారి తమ కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరు స్వీయ గణన చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.