ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అదేశించారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపుకలెక్టర్ లతో కలిసి స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు...