navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 1:44 pm Digital Edition : NAVAGEETAM

ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి తొలి అడుగు

సేవాభావం, ప్రజల నమ్మకమే నా బలం: మల్లు మధులత

నవగీతం, వైరా:

వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు కౌన్సిలర్‌గా మల్లు మధులత తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రజాసేవే ధ్యేయంగా, నిజాయితీతో పనిచేయాలనే ఆశయంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగారు.ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటూనే విద్యా, సామాజిక సేవల రంగంలో చురుకుగా పనిచేసిన మల్లు మధులత, టీచర్‌గా ,కంప్యూటర్ ట్రైనర్‌గా అనేక మందికి విద్యను అందించారు. యువతకు ఉద్యోగ మార్గనిర్దేశం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు చెబుతున్నారు

.5వ వార్డులో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, మహిళా భద్రత వంటి మౌలిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఆమె, సమస్యలకు శాశ్వత పరిష్కారాలే తన లక్ష్యమని తెలిపారు. ప్రజలతో కలిసి, ప్రజల కోసమే పనిచేసే నాయకత్వాన్ని అందిస్తానని చెప్పారు.మొదటి సారి రాజకీయ ప్రవేశం అయినప్పటికీ, సేవాభావం, ప్రజల నమ్మకమే తన బలమని మల్లు మధులత పేర్కొన్నారు. ఆమె తొలి రాజకీయ అడుగుకు వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.