ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి తొలి అడుగు

సేవాభావం, ప్రజల నమ్మకమే నా బలం: మల్లు మధులత నవగీతం, వైరా: వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు కౌన్సిలర్‌గా మల్లు మధులత తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రజాసేవే ధ్యేయంగా, నిజాయితీతో పనిచేయాలనే ఆశయంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగారు.ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటూనే విద్యా, సామాజిక సేవల రంగంలో చురుకుగా పనిచేసిన మల్లు మధులత, టీచర్‌గా ,కంప్యూటర్ ట్రైనర్‌గా అనేక మందికి విద్యను అందించారు. యువతకు ఉద్యోగ మార్గనిర్దేశం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు చెబుతున్నారు .5వ వార్డులో తాగునీరు,...