ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో ఘనంగా విద్యా వారోత్సవాలు
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రం లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో భరత మాత కూడలి నుండి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పది శాతం (10%) విద్యార్థుల ఎన్రోల్మెంట్ గురించి తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అనగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మంచినీటి వసతి, మరియు మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి...