ప్రజా వీరుడు పండుగ సాయన్న
కలెక్టరేట్ లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్22,(నవగీతం) నిజాం నిరంకుశత్వానికి,భూస్వామ్య వ్యవస్థ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపిన బహుజన వీరుడు ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ 'పండగ సాయన్న' జయంతి ఉత్సవాలను గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై పండుగ సాయన్న చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్...