ప్రతి సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల రెవెన్యూ డివిజన్ స్థాయిలో నూతనంగా ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఇంతకుముందు జిల్లా కలెక్టరేట్లో మాత్రమే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు డివిజన్ స్థాయికి విస్తరించారు.ఈ సందర్భంగా కోరుట్లలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను డివిజన్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు స్వీకరించారు. మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందగా, అందులో రెవెన్యూ శాఖకు ÷7), మున్సిపల్ శాఖకు (1), పంచాయతీరాజ్ శాఖకు (1)...