navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 5:32 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్

నవగీతం,జూన్28,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రం లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే లో మరణించిన వారి పేర్లు, ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాలలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, మరియు వలస వెళ్ళిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి,వంద శాతం దోషరహిత జాబితాను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.ఈ సర్వేకు బీ.ఎల్.ఓ లు ఇంటింటికీ వచ్చి ముద్రిత (ఎన్యుమరేషన్) ఫారాలను అందజేస్తారు.అధికారులు ఇచ్చిన ఫారంలో మీ ఓటరు వివరాలను,ఫోటోను సరిచూసుకోవాలి. ఎలాంటి మార్పులు, చేర్పులు ఉన్నా తగిన ధ్రువీకరణ పత్రాలు (ఆధార్, పాన్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు తదితరులు) సమర్పించాలి. అనంతరం ఫారంపై సంతకం చేసి, వివరాలను తిరిగి బీ.ఎల్.ఓ కు అందించాలి అని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు రాధ,నల్ల వసంత తో పాటు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి,కాంగ్రెస్ నాయకులు పూండ్ర లక్ష్మా రెడ్డి,వార్డు సభ్యులు ముష్కరి రమేష్,భుక్యా శేఖర్,ముత్యాల గంగా రాజం,అల్లె లత, మొరపు లక్ష్మి,గడ్డం అశోక్ రెడ్డి,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు