navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 12:04 pm Digital Edition : NAVAGEETAM

ప్రధాన రహదారిపై అస్తవ్యస్తంగా పార్కింగ్: ప్రయాణికుల అవస్థలు

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డుకు ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డుపై వాహనాల పార్కింగ్ క్రమపద్ధతిలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు నిమిషాల తరబడి రోడ్డుపైనే నిలిపి లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలు చేపట్టడం, దానికి తోడు వాహనాలను ఇష్టారాజ్యంగా పార్క్ చేయడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.ఈ అస్తవ్యస్త పార్కింగ్ వల్ల నిత్యం రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.