ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ఈ నెల 27న రాయికల్ శ్రీ చెన్నకేశవనాథ  (త్రికూటాలయం)లో వేడుకలు “డిజిటల్ అజెండా మరియు కృత్రిమ మేధస్సుతో పర్యాటక రంగం పునర్‌రూపకల్పన” ఈ ఏడాది థీమ్ జగిత్యాల/రాయికల్, సెప్టెంబర్23,(నవగీతం): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న జగిత్యాల జిల్లాలోని రాయికల్ గ్రామం, మండలంలోని శ్రీ చెన్నకేశవనాథ ఆలయం (త్రికూటాలయం)లో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం...