navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 6:58 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధి మీడియా

నవగీతం,జగిత్యాల:

జగిత్యాల కలెక్టరేట్‌లో వర్కింగ్ జర్నలిస్టులకు 2026-28 అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్ పంపిణీ చేశారు.ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభమని, ప్రభుత్వ పథకాలు, ప్రజల సమస్యలను చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని మంత్రి అన్నారు. వాస్తవాలను నిష్పాక్షికంగా అందించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.