ప్రభుత్వ కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి బి.నారాయణ. నవగీతం, జగిత్యాల జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బొప్పరాతి నారాయణ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్-711 ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం కలెక్టరేట్ భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యాపకులకు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలని పేర్కొన్నారు. జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం...