ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అట్టహాసంగా క్రీడా, సాంస్కృతిక వేడుకలు!

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలంతో సందడిగా మారింది. కళాశాలలో నిర్వహించిన క్రీడా మరియు సాంస్కృతిక దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్  నడిగట్ల సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల అభివృద్ధి కమిటీ సిపిడిసి సభ్యులు ,పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి మంచాల జగన్  మాట్లాడుతూ.. 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కళాశాల ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిందని కొనియాడారు.ముఖ్యంగా ఈ కళాశాలలో...