ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరపత్రం ఆవిష్కరణ
నవగీతం, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో గురువారం రోజున స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు అధికంగా చేయాలని కోరుతూ ఆ కళాశాల కరపత్రాన్ని సదరు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ఆధ్వర్యంలో కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, 2026-2027 విద్యా సంవత్సరంలో విద్యార్థులు కళాశాలలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని, అందుకోసం...