ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ను సన్మానించిన ఐకెపి ఎపిఎం

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్యను ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ ఏపీఎం)అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గట్ల అశోక్ తన కార్యాలయంలో గురువారం రోజున శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీఎం అశోక్ మాట్లాడుతూ...ప్రిన్సిపాల్ తనకు విజ్ఞానాన్ని అందించడం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని ప్రకటించారు. క్రమశిక్షణ, వినయ, విధేయతలు గల విద్యార్థులు,ఎప్పుడైనా మంచి స్థానంలో ఉంటారని,అందువల్ల అశోక్ కు పదోన్నతులు సత్వరమే రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని...