navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 8:24 am Digital Edition : NAVAGEETAM

ప్రభుత్వ పాఠశాలలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన సర్పంచ్

నవగీతం,ఇబ్రహీంపట్నం

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం సందర్బంగా వివిధ పోటీలలో భాగంగా శనివారం విద్యార్థులకు క్రికెట్ పోటీలు డబ్బా గ్రామ సర్పంచ్  పుప్పాల లక్ష్మి -మహేష్ ఉప సర్పంచ్ రాపెల్లి మహేష్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డబ్బా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లింగం పల్లి లక్ష్మి వి. డి. సి అధ్యక్షులు జాన శంకర్, మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, గ్రామ పెద్దలు వార్డు సభ్యులు పాలక వర్గం ఉపాధ్యాయులు మండలోజు అశోక్, అల్లకట్టు సత్యనారాయణ, చిలుముల రాజేష్, ఆడెపు నరేష్, బొల్లు శంకర్ తదితరులు పాల్గొన్నారు