ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది
మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలంలోని రాఘవపెట్ గ్రామంలో విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని స్థానిక అధికారులు,ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ ఉపసర్పంచ్ పాలకవర్గ సభ్యులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని తల్లిదండ్రులకు విద్య అవసరాన్ని వివరించి, పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే విద్యాసంవత్సరం నుండి విద్యార్థులకు అవసరమ్యే అన్ని వసతులు బూట్లు, టై,...