ప్రభుత్వ పాఠశాలల్లో అనూహ్యంగా పెరిగిన విద్యార్థుల నమోదు
గ్రామ సర్పంచులు,ప్రజాప్రతినిధులు సహకారంతో మరింత పెరుగుదల నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరగడం పట్ల మండల విద్యాశాఖాధికారి కేతిరి దామోదర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. ఎంపీయూపిఎస్ కుస్తాపూర్ పాఠశాలలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్, ఉపసర్పంచ్ మహీపాల్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాల ఫలితంగా, గతంలో 22 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 152 మందికి చేరుకుంది. అదేవిధంగా ఎంపీపీఎస్ రత్నాపూర్ పాఠశాలలో కూడా విద్యార్థుల నమోదు విశేషంగా పెరిగి, గతంలో 21...