ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యం.జిల్లా కలెక్టర్

నవగీతం, జగిత్యాల మల్యాల మండలం కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని  హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని  ప్రతీ...