navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 12:46 am Digital Edition : NAVAGEETAM

ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభం

– జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధర్మపురిలో ఎన్నికల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని, పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అనంతరం ఆయన మాట్లాడారు.

పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ సరళిని ప్రశాంతంగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.