ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవగీతం,పెద్దపల్లి: గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి.ప్రెస్ క్లబ్ అద్యక్షులు నారాయణదాస్ అశోక్,ప్రదాన కార్యదర్శి పోగుల విజయ్ లు మహనీయుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అద్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చిందని,ఈ సందర్భంగా దేశంలో కుల,మతాలకు అతీతంగా అందరు జరుపుకునే జాతీయ పండగగా పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోదుల త్యాగాలను, అంబేడ్కర్‌ రాజ్యాంగ నిర్మాత కృషిని,భారత రాజ్యాంగ విశిష్టతను వివరించారు.ఈ కార్యక్రమంలో...