navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 11:23 am Digital Edition : NAVAGEETAM

ప్రెస్ క్లబ్ సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే

నవగీతం, జగిత్యాల

జగిత్యాల పట్టణ లో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను  మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్, ఉపాధ్యక్షులు ముసిపట్ల దేవేందర్, బద్దెనపల్లి మల్లేశం, శనిగరపు శ్రీనివాస్,  కోశాధికారి బోయినపల్లి శ్రీధర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కడార్ల రంజిత్ కుమార్, సంయుక్త కార్యదర్శులు బద్దం నారాయణరెడ్డి, గాజుల మహేష్. కార్యవర్గ సభ్యులుగా నీరటి గంగాధర్, కల్లెడ హరీష్, ఎల్ల క్రాంతి కుమార్, సామా మహేష్, వాసం రఘు, ఎండి సాబేర్, కట్కూరి సంతోష్, దిండిగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.