ప్లాస్టిక్  వాడకం పై వార సంతలో అవగాహన

దుకాణదారులు సహకరించాలని విజ్ఞప్తి నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారసంత లో కూరగాయలు అమ్మే వారికి గ్రామపంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సమస్య. ప్లాస్టిక్ వాడకం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దాని వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ, భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఇది నేల, నీరు, గాలిని కలుషితం చేస్తుంది,ప్లాస్టిక్...