ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి

ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా నవగీతం, ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను నిషేధం చేస్తున్నట్టు బహిరంగ ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పొనుకంటి చిన్న వెంకట్ మాట్లాడుతూ నేటి నుండి అనగా జులై01 నుండి  ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన గ్రామాన్ని పరిశుభ్రంంగా ఉంచుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం...