navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 10:28 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నవగీతం ,(రాయికల్ ప్రతినిధి)

పర్యావరణాన్ని కాపాడేందుకు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ఉపయోగించాలి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని సర్పంచ్ నల్లాల స్వామి కోరారు.మనం నిత్యం భోజనానికి వాడే ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు వాడకం మానేసి ప్రకృతి ద్వారా దొరికే మోదుగ ఆకుల ద్వారా విస్తారాకులు ప్లేట్లుగా తయారు చేసుకొని వాడాలన్నారు. పంచాయతీ కార్యదర్శి రమ్య మాట్లాడుతూ ఇప్పుడు మోదుగ ఆకులు చిగురోచ్చే సమయం లేత ఆకులను వాడి ప్లేట్స్ తయారు చేయండి. మీ అవసరానికి మించి తయారు చేసినట్లయితే వాటిని మార్కెటింగ్ మేము చేయిస్తామని హామీ ఇచ్చారు. విస్తారు ఆకుల ద్వారా ఉపాధి పొందాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఉపాధి కోసం బీడీలు, పోగాకు చుట్టడం ఆరోగ్యానికి హానికరం అని సూచించారు. ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో భాగంగా కార్యదర్శి మాట్లాడుతూ తవ్వకం త్వరగా అయినవారు ఇక్కడ అడవిలో దొరికే ఆకులతో ప్లేట్స్ కుట్టడం దానిద్వారా కూడా ఆదాయం, ఆరోగ్యం పొందవచ్చన్నారు, రైతులు పంటపోలాలలో వ్యర్థాలని కాల్చి వాతావరణం కాలుష్యం చేయద్దు, తోటలోనే కలియ దున్ని భూసారం పెంచాలని రైతులనుద్దేశించి మాజీ సర్పంచ్ మెక్కొండ రాంరెడ్డి కోరారు.ఉపసర్పంచ్ చల్ల మహేష్,వార్డు సభ్యులు ఆకుల నర్సారెడ్డి,జీవరత్నం, జ్యోతి, స్వాతి ఫీల్డ్ అసిస్టెంట్ గాజంగి నర్సయ్య.