navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 1:55 pm Digital Edition : NAVAGEETAM

ప్లాస్టిక్ రహిత వినాయక మండపాలకు స్నేహాలయ పురస్కార్

మెట్‌పల్లి,సెప్టెంబర్11,(నవగీతం):వినాయక నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినాయక మండపాల్లో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించడంతో పాటు నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించే మండప నిర్వాహకులను అభినందిస్తూ స్నేహాలయ పురస్కార్” అవార్డును అందజేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కోట కిరణ్ కుమార్ తెలిపారు.మండపాల్లో ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు, స్వీట్ కప్పులు, టీ కప్పులు తదితరాలను ఉపయోగించకుండా,కేవలం భక్తి పాటలతో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించే మండప నిర్వాహకులకు ఈ పురస్కారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ప్రజాహితం మా పథం” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సహకరించి ప్లాస్టిక్ రహిత ఉత్సవాలను నిర్వహిస్తూ అందుకోవాలని కోట కిరణ్ కుమార్ కోరారు.