ఫుట్ పాత్ ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవగీతం,ఖమ్మం : ఖమ్మం నగరంలో ఆధునిక మౌళిక వసతులతో పాటు ప్రజలకు నడకలో సౌకర్యం, ఆర్యోగం, భద్రత కల్పించే విధంగా ఫుట్ పాత్ ల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు. ఎస్ఆర్ &బీజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతం నుండి చేపట్టనున్న ఫుట్‌పాత్ పై వినూత్నంగా గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసే పనులను, టైల్స్ డిజైన్...