‘బడిబాట’కు విశేష స్పందన: ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కథలాపూర్ మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామంలో సోమవారం ముందస్తు 'బడిబాట' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామంలోని పలు వార్డులలో ఉపాధ్యాయ బృందం ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న నాణ్యమైన విద్య, వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా, తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని వారు స్వచ్ఛందంగా హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు జయలక్ష్మి మరియు మహేష్ అలాగే ఉపాధ్యాయ బృందం మహేందర్, రమేష్, ప్రసన్నదీప్తి మరియు శ్రావణి...