బహుజన రాజ్య స్థాపనతోనే అణగారిన వర్గాలకు న్యాయం
జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య బహుజనుల గోస కరపత్రం ఆవిష్కరణ నవగీతం,పెద్దపల్లి: స్వతంత్ర భారతంలో 78 ఏళ్లు గడుస్తున్నా బహుజనుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని,వారి సమస్యలను ఎలుగెత్తి చాటేందుకే బీఎస్పీ పోరాడుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు 78 ఏళ్ల బహుజనుల గోస కరపత్రాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్...