బాధ్యతాయుతమైన ఓటరుతోనే బలమైన ప్రజాస్వామ్యం
బీఎల్ఓ రాష్ట్ర అధ్యక్షురాలు నజీమా బేగం నవగీతం,మెట్ పల్లి: ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, బాధ్యతాయుతమైన ఓటరుతోనే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని బీఎల్ఓ రాష్ట్ర అధ్యక్షురాలు నజీమా బేగం పేర్కొన్నారు. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు....