navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 7:16 pm Digital Edition : NAVAGEETAM

బార్ అసోసియేషన్ కోశాధికారిగా చింతకింది ప్రేమ్ కుమార్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల అడ్వకేట్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో చింతకింది ప్రేమ్ కుమార్ ఘన విజయం సాధించారు. అసోసియేషన్ ట్రెజరర్ (కోశాధికారి) పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్నికవ్వడం పట్ల తోటి న్యాయవాదులు మరియు పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.న్యాయవాద వృత్తిలో తనదైన ముద్ర వేస్తూ, అందరితో స్నేహపూర్వకంగా ఉండే ప్రేమ్ కుమార్, బార్ అసోసియేషన్ అభివృద్ధికి మరియు నిధుల సక్రమ నిర్వహణకు విశేష కృషి చేస్తారని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయనను పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. చింతకింది ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ట్రెజరర్‌గా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.