బాలబంధు గద్వాల సోమన్నకు ఉగాది పురస్కారం

నవగీతం, కర్నూలు: కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాల సాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్నను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం -2026 వరించింది.అనతి కాల వ్యవధిలో 94 పుస్తకాలు వ్రాసి ముద్రించి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని పలువురు ప్రముఖులచే ప్రశంసలు అందుకున్నారు.శతాధిక గ్రంథకర్తకు అతి సమీపంలో ఉన్నారు.తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో విశేష కృషికిగాను ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు,...