బాసర త్రిబుల్ ఐటీ సీటు విజేత మనస్విని కి ఘన సన్మానం.
నవగీతం,(మల్లాపూర్ ప్రతినిధి): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బద్దం మనస్విని బాసరలో త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. సింగిల్ విండో చైర్మన్ నేరెళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి వెళ్లి మల్లాపూర్ మోడల్ స్కూల్లో అత్యధిక మార్కులు సాధించి బాసర త్రిబుల్ ఐటీ లో సీటు రావడం చాలా సంతోషాన్నిస్తుందని మా గ్రామానికి ప్రత్యేకమైన పేరు తెచ్చిందని కొనియాడారు...