బిజెపిలో చేరిన వెల్గటూర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ
నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఉమ్మడి వెల్గటూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ మామిడిపల్లి విజయ ప్రసాద్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడి, బిజెపి పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబారిపేటలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మామిడిపల్లి ప్రసాద్ సుమారుగా 100 మంది తన అనుచరులతో కలిసి బిజెపి పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ ధర్మపురి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు పార్టీ కండువా కప్పి...