బిల్లుపాడు లో ఎన్టీఆర్ వర్ధంతి
నవగీతం,తల్లాడ: తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామం జెకె నగరం సెంటర్ లో టీడీపీ దిమ్మె వద్ద ఆదివారం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్ర పటానికి టీడీపీ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.జక్కంపూడిచంద్రశేఖర్,ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు నారపోగు ప్రసాద్, జక్కంపూడి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మహా నాయకుడు ఎన్టీఆర్ తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లల్లో...