మల్లాపూర్, నవంబర్01,(నవగీతం)
భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి అనూప్ రావు ఆధ్వర్యంలో రాఘవపేట గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బోసు రాము వడ్డెరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ కండువా కప్పి బోసు రాము వడ్డెరాజ్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు బైన ప్రశాంత్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి దేశెట్టి భూమేష్, కిసాన్ మోర్చా మల్లాపూర్ మండల అధ్యక్షులు కుర్మ రాజారెడ్డి, సీనియర్ నాయకులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.