బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ని కలిసిన స్వర్ణకార సంఘ ప్రతినిధులు

నవగీతం, మెట్ పల్లి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘును శుక్రవారం సాయంత్రం మెట్ పల్లి పట్టణ స్వర్ణకార సంఘ ప్రతినిధులు కలిశారు. పట్టణంలోని కార్యాలయంలో డాక్టర్ రఘును కలిసి పలు సమస్యలను విన్నవించారు. పట్టణంలో స్వర్ణకార సంఘానికి సంబంధించి కమిటీ హాలు నిర్మాణానికి ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో కృషి చేయాలని కోరారు. తమ సంఘానికి 156 గజాల ఖాళీ స్థలం సిద్ధంగా ఉందని భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించడానికి సహకరించాలని కోరారు. కొంతమంది పేద స్వర్ణకారులకు సొంత ఇల్లు...