navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:45 pm Digital Edition : NAVAGEETAM

బీజేవైఎం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఇట్టేడి రాజు నియామకం

నవగీతం ,జగిత్యాల:

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా  ఇట్టేడి రాజును  నియమిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కొండే గణేష్  కు, నిజామాబాద్ (ఇందూరు) పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, అలాగే జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు కు ఇట్టేడి రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువతను పార్టీ సిద్ధాంతాల వైపు మరింతగా ఆకర్షించి, జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా యువ మోర్చాను బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు విస్తరించి, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.