బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ భారీ విజయం

మల్లాపూర్ మండల కేంద్రంలో సంబరాలు నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడంపై మల్లాపూర్ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.మల్లాపూర్ మండల బిజెపి అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భరతమాత కూడలి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని కొక్కు గంగాధర్ పేర్కొన్నారు....