బైంసా నుండి కొండగట్టుకు పాదయాత్ర
స్థానిక గట్టు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నవగీతం,జగిత్యాల ప్రతినిధి: భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కాసరోల్ల ప్రవీణ్ చేపట్టిన పాదయాత్ర భక్తి వాతావరణంలో ప్రారంభమైంది.భైంసా మున్సిపాలిటి లో కాషాయ జెండా ఎగిరితే కొండగట్టులోని అంజన్న స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు. ఆ మొక్కు నెరవేర్చుకునే క్రమంలో పాదయాత్రగా కొండగట్టు పవిత్రక్షేత్రం వైపు బయలుదేరారు. మంగళవారం కొడిమ్యాల గట్టు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక చైర్మన్ బిజెపి తుమ్మల దత్తాత్రి బిజెపి...