భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి

జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్ కోరారు. ఏఐసీబీడబ్ల్యు జాతీయ కమిటీ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 23న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించి వినతి పత్రం సోమవారం మెట్ పల్లిలోని కార్మిక శాఖ అధికారి (లేబర్ ఆఫీసర్) ఆర్ క్రిష్ణసాగర్ కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం జగిత్యాల జిల్లా...