భారీ వర్షాల నేపథ్యంలో యామాపూర్–ఫకీర్ కొండాపూర్ గ్రామాల వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్

నవగీతం,జగిత్యాల/ఇబ్రహీంపట్నం:జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితి పై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేగవంతంగా చర్యలు చేపట్టాలని...