భీమా ద్వారా అందరికీ ధీమా
నవగీతం,ఇబ్రహీంపట్నం: అందరూ భీమా చేసుకోవడం వల్ల కుటుంబానికి ధీమాగా ఉంటుందని ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ సర్పంచ్ వెంకట్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో సోమవారం అందరికీ బీమా మన గ్రామానికి ధీమా అనే కార్యక్రమాన్ని సర్పంచ్ పోనకంటి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్ మాట్లాడుతు ఆకస్మాత్తుగా జరిగే ప్రమాదాల దృష్ట్యా కుటుంబాలకు పి ఎం ఎస్ బి వై భీమా ఆశారాగా నిలుస్తుందని తెలిపారు.గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ నుంచి భీమాకు సంబంధించిన డబ్బులను చెల్లిస్తామని...