navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 7:29 am Digital Edition : NAVAGEETAM

భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద కేంద్రం తనిఖీ చేసిన ఈఓ

నవగీతం,రాజన్న సిరిసిల్ల:

భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద కేంద్రం తనిఖీ చేసిన ఈఓ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈఓ రమాదేవి సోమవారం తనిఖీ చేశారు. ఈ మేరకు లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు.అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.