navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 12:51 am Digital Edition : NAVAGEETAM

మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి

మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి

నవగీతం, మెట్ పల్లి

వార్డులో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఒకటో వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ తో కలిసి వార్డు సందర్శన చేశారు. వార్డులో నూతనంగా ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశం చేసిన సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వార్డులో మంచినీటి సమస్య పై పరిశీలన జరిపారు. వార్డులో నెలకొన్న మంచినిటి సమస్యను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. బోరు బావి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాడు అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, బీజేపీ నాయకులు అరిగెల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.