మండల నాయి బ్రాహ్మణ కార్యవర్గం ఏకగ్రీవం

నవగీతం,మల్లాపూర్ మల్లాపూర్ మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ(మంగలి) సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సంఘ సమావేశంలో సంఘ మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా వాల్గొండ గ్రామానికి చెందిన జకినపల్లి రాములు, ఉపాధ్యక్షులు గా పెండపు జగదీష్ , ప్రధాన కార్యదర్శి ముత్యాల నరసయ్య , కోశాధికారిగా ప్రమోద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ రుణపడి ఉంటాను అని మన సంఘ అభివృద్ధికి సంఘ కట్టుబాట్లను పాటిస్తూ అందరికీ సేవ చేస్తానని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని...