navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 10:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం..

కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం

ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం.

నవగీతం,కరీంనగర్:

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులుకరీంనగర్ లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గానికి చెందిన రైతులను పరామర్శించడానికి మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడో అంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.ప్రమాదం అనంతరం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి పనితీరుపై  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రికి మెడికల్ కు సంబంధం లేని వ్యక్తులు నిర్వహిస్తూ ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు.కనీస వైద్య సదుపాయాలు లేకున్నా అర్హత లేని వైద్యులతో ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. కరీంనగర్ లో మెడికల్ మాఫియా రాజ్యం ఎలుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు లేకుండా మంత్రి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.